Realme C55 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ.. భారత్ మార్కెట్లోకి `సీ55` పేరిట మరో బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ నెల 28 నుంంచి భారత్ మార్కెట్లో సేల్స్ ప్రారంభం అవుతాయి. త్రీ రామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. ఆపిల్ ఐ-ఫోన్ తరహాలో స్లిమ్ డిజైన్‌తో వస్తున్న తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. అంతే కాదు బ్యాటరీ సామర్థ్యం,డేటా వాడకంతోపాటు హెల్త్‌కు ప్రాధాన్యం ఇచ్చే స్టెప్ కౌంట్ వివరాలు తెలిపేందుకు డిజైన్ చేసిన `మినీ క్యాప్సుల్` ఫీచర్ కొత్తగా జత చేసింది.
మూడు వేరియంట్లలో రియల్మీ `సీ55` ఫోన్ అందుబాటులోకి వస్తున్నది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల వేరియంట్ ఫోన్ రూ.10,999లకు కొనుగోలు చేయొచ్చు. 6జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.11,999, 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,999లకు లభ్యం అవుతుంది. సన్ షోవర్, రైనీ నైట్ కలర్స్‌లో ఇది లభిస్తుంది.