Realme C51 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme).. మరో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ రియల్మీ సీ51 (Realme C51).. భారతీయులకు అందుబాటులోకి తెచ్చింది. రెండు కలర్ ఆప్షన్లలో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.9000 లోపే. కార్బన్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. రియల్మీ సీ 51 ఫోన్ (Realme C51) 6.74-అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. బ్యాటరీ స్టేటస్, డేటా యూసేజ్ తోపాటు డెయిలీ స్టెప్స్ వంటి వివరాలు తెలిపే మినీ క్యాప్సూల్ ఈ ఫోన్ స్పెషాలిటీ. 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది.
రియల్మీ సీ51 (Realme C51) ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8999లకు లభిస్తుంది. రియల్మీ డాట్ కాం, ఫ్లిప్కార్ట్తోపాట్ ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ లాంచింగ్ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంకుల కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.500 అదనపు డిస్కౌంట్ అందిస్తోంది.
రియల్మీ సీ51 (Realme C51) ఫోన్ 6.74 – అంగుళాల హెచ్డీ (720×1600 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తున్నది. 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుందని చెబుతున్నది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ612 ఎస్వోసీ చిప్ సెట్ ఉంటుంది. 4జీబీ రామ్ గల ఈ ఫోన్ వర్చువల్‌గా మరో 4జీబీ రామ్ పెంచుకునే టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది.
రియల్మీ సీ51 (Realme C51) ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్ / 1.8 అపెర్చర్, అన్ స్పెషిఫైడ్ సెకండరీ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఎఫ్/2.0 అపెర్చర్ ఆప్షన్ కలిగి ఉంటుంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3-కార్డ్ స్లాట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.