Realme 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన 5జీ ఫోన్ల సేల్స్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ నెల 17 వరకూ కొనసాగే వివిధ మోడల్ 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలపై పలు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి.
ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన రియల్మీ నార్జో 60ఎక్స్, రియల్మీ 11 5జీ, రియల్మీ 11 ప్రో తదితర మోడల్ ఫోన్లపై ఈ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. వీటి కొనుగోళ్లపై కస్టమర్లు 12 వేల వరకు సొమ్ము ఆదా చేయొచ్చు. ఇన్స్టంట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్ ఉంటాయి.
ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన రియల్మీ నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్‌పై ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రూ.11,999లకే లభిస్తుంది. అదనంగా కొనుగోలుదారులకు రూ.279 విలువ చేసే 2000 కాయిన్స్ రివార్డ్, ఆరు నెలల స్ర్కీన్ డామేజ్ ప్రొటెక్షన్ ప్రీ వంటి ఆఫ్‌లు అందిస్తుంది.
రియల్మీ 11 సిరీస్ ఫోన్లు రియల్మీ 11 5జీ, రియల్మీ 11ప్రో 5జీ, రియల్మీ 11ప్రో+ 5జీ ఫోన్లపై వేర్వేరు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. రియల్మీ 11 5జీ ఫోన్ మీద రూ.1,500 డిస్కౌంట్ అందిస్తే, మిగతా వాటిపై రూ.2000 వరకు డిస్కౌంట్‌తోపాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. రియల్మీ11 ప్రో ఫోన్ రూ.21,999, రియల్మీ11 ప్రో+ ఫోన్ రూ.25,999 పలుకుతున్నాయి.
రియల్మీ 11 5జీ ఫోన్‌పై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ వాడుకుంటే డిస్కౌంట్ వర్తించదు. రియల్మీ11 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 1‘ జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తాయి.
రియల్మీ నార్జో 60 5జీ, రియల్మీ 60 ప్రో 5జీ, ఫోన్లపై డిస్కౌంట్ రూ.1300 నుంచి రూ.2000లకు పెంచింది. ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.250 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.