Realme 12 Pro+ | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ 12 ప్రో+ ఫోన్‌ను ఈ నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీంతోపాటు రియల్మీ12 ప్రో ఫోన్ కూడా ఆవిష్కరిస్తారు. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లు, కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ5 వర్షన్‌పై ఔటాఫ్ బాక్స్ పని చేసే ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. బ్లాక్, ఆరెంజ్, క్రీమ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్.
నోటిఫికేషన్ అలర్ట్స్తోపాటు యానిమేషన్ మద్దతుతో 6.7అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందీ రియల్మీ 12 ప్రో+. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. రియల్మీ 12 ప్రో+ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 64-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 32 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. రియల్ మీ12 ప్రో మాత్రం 16 ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తోంది.
క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 చిప్ సెట్‌తోపాటు 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుందీ రియల్మీ 12+. రియల్ మీ 12 ప్రో ఫోన్ మాత్రం ఒక్టాకోర్ ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటది. రెండు ఫోన్లు కూడా 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటాయి.