Realme 12 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన మిడ్ రేంజ్ ఫోన్ రియల్మీ 12జీ (Realme 12 5G) భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్మీ12తోపాటు రియల్మీ12+ కూడా వస్తున్నది. రియల్మీ12+ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ ప్లే, 50 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. రియల్మీ12 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.72 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు రెండు కలర్ ఆప్షన్లు, రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అయ్యాయి. దీని ధర రూ.16,999 నుంచి ప్రారంభం అవుతుంది.
రియల్మీ12 ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటాయి. మరోవైపు రియల్మీ12+ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే విత్ 2000 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది.
రియల్మీ12 ఫోన్లో 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతోపాటు 2 మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. రియల్మీ12+ ఫోన్ లో 50-మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ – 2 మెగా పిక్సెల్ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం రియల్మీ12 ఫోన్లో 8-మెగా పిక్సెల్, రియల్మీ12+ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
రియల్మీ12 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, రియల్మీ12+ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో వస్తున్నాయి. రియల్ మీ 12 ఫోన్ 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రియల్మీ12+ ఫోన్ లో 67 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటాయి.