Realme 11 5G Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme).. రియల్మీ 11 5జీ సిరీస్ (Realme 11 5G) ఫోన్లు భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్మీ11 5జీ (Realme 11 5G), రియల్మీ11ఎక్స్ 5జీ (Realme 11X 5G) ఫోన్లు రెండేసీ వేరియంట్లలో తీసుకొచ్చింది. వీటితోపాటు ‘బడ్స్ ఎయిర్6 సిరీస్ (Buds Air 5 series)’ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా ఆవిష్కరించింది.
రియల్మీ11 5జీ (Realme 11 5G) , రియల్మీ11ఎక్స్ 5జీ (Realme 11X 5G) ఫోన్లు 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియాల్టీ యూఐ 4.0 వర్షన్‌పై పని చేస్తాయి.
రియల్మీ11 5జీ (Realme 11 5G) ఫోన్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా విత్ 3ఎక్స్ జూమ్, రియల్మీ11ఎక్స్ 5జీ (Realme 11X 5G) ఫోన్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా ఆప్షన్ ఉంటుంది. రెండింటిలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా లభిస్తుంది.
పవర్ బ్యాకప్ కోసం రియల్మీ11 5జీ (Realme 11 5G) ఫోన్ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 17 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. రియల్మీ11ఎక్స్ 5జీ (Realme 11X 5G) ఫోన్ 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. రెండు ఫోన్లూ డ్యుయల్ బాండ్ వై-ఫై, 5జీ బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ ఉంటుంది.
రియల్మీ11 5జీ (Realme 11 5G) ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.18,999, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.19,999లకు లభిస్తాయి. గ్లోరీ బ్లాక్, గ్లోరీ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ డాట్ కామ్ ద్వారా ఈ నెల 29 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ నెల 30 నుంచి ఆఫ్ లైన్, ఆధరైజ్డ్ రిటైల్ స్టోర్లలో సొంతం చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
మరోవైపు రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G) ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తాయి. ఈ ఫోన్లు మిడ్ నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.
ఎయిర్ 5 సిరీస్‌లో రియల్మీ రెండు రకాల వైర్లెస్ ఇయర్ బడ్స్ రిలీజ్ చేసింది. రియల్మీ బడ్స్ ఎయిర్5 ప్రో, రియల్మీ బడ్స్ ఎయిర్5 అనే పేరుతో ఆవిష్కరించింది. రియల్మీ బడ్స్ ఎయిర్5 ప్రో రూ.4,999, రియల్మీ బడ్స్ ఎయిర్5 రూ.3,699లకు లభిస్తాయి. రియల్మీ బడ్స్ ఎయిర్5 ప్రో ఫస్ట్ సేల్‌పై రూ.500, రియల్మీ బడ్స్ ఎయిర్5 ఫస్ట్ సేల్‌పై రూ.200 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.