Realme 11 5G & 11X |చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన 11 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది. రియల్మీ11 5జీ ఫోన్‌తోపాటు రియల్మీ11ఎక్స్ 5జీ ఫోన్లను ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నది. గత మే నెలలోనే రియల్మీ11 ప్రో 5జీ, రియల్మీ11 ప్రో+ 5జీ ఫోన్లు ఆవిష్కరించింది.
ఈ నెల 23 నుంచి 28 వరకు రియల్మీ11 5జీ, రియల్మీ11ఎక్స్ 5జీ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాతే సేల్స్ ప్రారంభం అవుతాయి. రియల్మీ11 5జీ ఫోన్.. ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ.1,299 విలువ గల ’రియల్మీ బడ్స్ వైర్ లెస్ 2 నియో’ ఉచితంగా అందజేస్తారు. రియల్మీ11ఎక్స్ 5జీ ఫోన్ ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి రూ.599 విలువ గల రియల్ మీ బడ్స్2 ఉచితంగా అందిస్తారు.
రియల్మీ11 5జీ ఫోన్ ‘గ్లోరీ హెలో’ డిజైన్‌తోనూ, రియల్మీ 11 ఎక్స్ 5జీ ఫోన్ ఎస్-కర్వ్ డిజైన్ తో వస్తుందని భావిస్తున్నారు. రెండు ఫోన్లు ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నాయి. 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుందని తెలుస్తున్నది.
రియల్మీ11 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్స్ విత్ గ్లోరీ బ్లాక్, గ్లోరీ గోల్డ్ కలర్స్.. రియల్మీ 11 ఎక్స్ 5జీ ఫోన్ 6 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్.. మిడ్ నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయని భావిస్తున్నారు. రెండు ఫోన్లు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటాయి.
రియల్మీ11 5జీ ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, రియల్మీ11ఎక్స్ 5జీ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.