త్వరలో డిజిటల్ రూపీ

- పైలెట్ ప్రాజెక్టులకు యోచన
- ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 22: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఓ డిజిటల్ కరెన్సీని పరిచయం చేయబోతున్నది. దశలవారీగా దీన్ని చలామణిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులోనే పైలెట్ ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కరెన్సీని హోల్‌సేల్, రిటైల్ విభాగాల్లో ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ గురువారం ఇక్కడ తెలిపారు. ఇప్పటికే హోల్‌సేల్, రిటైల్ సెగ్మెంట్లలో పలు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు తమ డిజిటల్ కరెన్సీలను వాడుకలోకి తెచ్చాయని ఆయన గుర్తుచేశారు. ‘ది విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ నిర్వహించిన ఆన్లైన్ చర్చలో రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ దేశీయంగా సెంట్రల్ బ్యాంకే ఓ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ వాడకంతో వచ్చే లాభాలను ప్రజలందరికీ చట్టబద్దంగా అందించినట్లవుతుందన్నారు. డిజిటల్ కరెన్సీకి కూడా ఓ రూపాయి తరహాలోనే ప్రాధాన్యతను కల్పించవచ్చన్నారు. అంతేగాక ప్రైవేట్ వర్చువల్ కరెన్సీల్లో తలెత్తే ఒడిదుడుకుల నుంచి ప్రజలను రక్షించినట్లవుతుందని కూడా వ్యాఖ్యానించారు. నగదుపై ఆధారపడటం తగ్గి, లావాదేవీల వ్యయం దిగివస్తుందన్న ఆయన దీనివల్ల అటు పరిశ్రమకు ఇటు ప్రజలకు లాభం చేకూరగలదని అభిప్రాయపడ్డారు. అయితే సాంకేతికంగా ఇందుకున్న సాధ్యాసాధ్యాలను, బ్యాంకర్లు-పరిశ్రమ అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం వస్తుందన్నారు. ఎందుకంటే దీని విలువ పడిపోతే బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

