న్యూఢిల్లీ, నవంబర్ 22: ముందు జాగ్రత్తగానే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే అన్సెక్యూర్డ్ రుణాలపై నిబంధనలు కఠినతరం చేశామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. రిటైల్ రుణాలపై ఆర్బీఐ ఇటీవల రిస్క్ వెయిట్‌ను 125 శాతానికి పెంచింది. అంటే సెక్యూరిటీ లేకుండా ఇచ్చే ప్రతీ పర్సనల్ రుణం మొత్తంపై ఆయా ఆర్థిక సంస్థలు అంతే శాతం మూలధనాన్ని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై బుధవారం ఫిక్కీ, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో శక్తికాంత దాస్ మాట్లాడుతూ రిస్క్ ఏర్పడుతున్నట్టు గ్రహిస్తే మరింత జాగురూకతతో ఉండాలని బ్యాంక్‌లకు సూచించారు. వాహన, గృహ రుణాలు, చిన్న వ్యాపార రుణాలపై రిస్క్ వెయిట్‌ను మినహాయించామని, ఆ విభాగాల్లో ఒత్తిడి ఏర్పడుతున్న సంకేతాలేవీ లేవన్నారు.