పీఎంసీ బ్యాంక్ టేకోవర్‌కు సెంట్రం ఫైనాన్సియల్కు ఓకే!
పీఎంసీ బ్యాంక్ టేకోవర్‌కు సెంట్రం ఫైనాన్సియల్కు ఓకే! సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)ని సెంట్రం ఫైనాన్సియల్...

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)ని సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్‌కు అప్పగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ బ్యాంకును టేకోవర్ చేసుకునేందుకు ఆర్బీఐ ముందు బిడ్లు దాఖలు చేసిన నాలుగు సంస్థల్లో సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్, భారత్-పే ఉన్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్‌కు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949లోని 22 (1) సెక్షన్ ప్రకారం సెంట్రం ఫైనాన్స్.. ప్రైవేట్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) యాజమాన్యం మొండి బకాయిల వివరాలను వెల్లడించకపోవడంతోపాటు పలు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ తనిఖీలో తేలింది. దీంతో 2019 సెప్టెంబర్‌లో ఈ బ్యాంకు లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాల వివరాలను ఆర్బీఐకి వెల్లడించకుండా పీఎంసీ బ్యాంకు దాచిపెట్టింది. 2019 సెప్టెంబర్ 19న జరిపిన తనిఖీల్లో హెచ్‌డీఐఎల్‌కు పీఎంసీ ఇచ్చిన రుణాలు రూ.6,500 కోట్ల పై చిలుకే.
మొత్తం పీఎంసీ బ్యాంకు మంజూరు చేసిన రుణాల్లో 73 శాతం హెచ్‌డీఐఎల్‌కే ఇచ్చింది. దీంతో పీఎంసీలో లావాదేవీలపై ఆర్బీఐ మరింత ఆంక్షలు విధించింది ఆర్బీఐ.
తొలుత రూ.1000 వరకే డిపాజిటర్లు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ.. తర్వాత వారి కష్టాలకు అనుగుణంగా రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతించింది. గతేడాది జూన్‌లో పీఎంసీపై విధించిన ఆంక్షలను 2020 డిసెంబర్ 22 వరకు పొడిగించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- centrum financila
- pmc
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

