అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
గుర్రంపోడు మండలంలోని అన్ని చెరువులను డి-17, 19 కాలువల ద్వారా తక్షణమే నీటితో నింపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ...
– మండలంలోని చెరువులను తక్షణమే నింపాలని డిమాండ్
గుర్రంపోడు, నవంబర్ 02 : గుర్రంపోడు మండలంలోని అన్ని చెరువులను డి-16, 17, 19, 22, 25 కాలువల ద్వారా తక్షణమే నీటితో నింపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. మండల పరిధిలోని చెరువులన్ని నీరు లేక వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో నీరు లేకపోవడంతో రాబోయే రోజుల్లో పశుపక్ష్యాదులు, మూగ జీవాలకు తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చెరువులు ఎండిపోవడం వల్ల భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోయి, గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే నీటి సమస్యపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి చెరువులను నింపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
ఏఎమ్మార్పీ కెనాల్ ద్వారా చెరువులకు సాగునీటిని విడుదల చేసి మండలంలోని అన్ని చెరువులను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువుల్లో నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు పెరగడంతో పాటు పశువులకు తాగునీరు, రైతులకు వ్యవసాయ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాయకులు వివరించారు. అనంతరం ఎస్ఎల్బీసీ ఏఈ చంద్రప్రకాష్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చెరువులకు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పిల్లి ఉమారాణి అభినయ్, మేకల రమణసత్యనారాయణ, వెలగపురి రాంబాబు రావు, నాయకులు కామళ్ల రాములు, టంగుటూరి సురేశ్, కొండ నరేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పామనగుండ్ల వెంకన్న గౌడ్, ఉప సర్పంచ్ జంగాల చంద్రయ్య, వడ్డేగోని గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? : వీడియో
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక
K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

