AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
AP News | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను తీవ్రమైన మనోవేదన అనుభవించానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతున్నదని ఆయన ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 11న తన కొత్తపార్టీ పేరును వెల్లడిస్తానని స్పష్టంచేశారు.
AP News : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను తీవ్రమైన మనోవేదన అనుభవించానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతున్నదని ఆయన ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 11న తన కొత్తపార్టీ పేరును వెల్లడిస్తానని స్పష్టంచేశారు. టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ తన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు.
కొత్త పార్టీలో ఓవీ రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తామిద్దరం గతంలో టీటీడీ బోర్డులో కలిసి పనిచేశామని, ఆ అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కాగా ఓవీ రమణ టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. తాను విజయసాయి పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రమణను విజయసాయి తన పార్టీలోకి స్వాగతించారు. ఇక నవంబర్ 11న 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రకటించడంపై వస్తున్న ట్రోల్స్‌పైనా విజయసాయి స్పందించారు.
పండితులు సూచించిన ముహూర్త బలం ప్రకారమే ఆ సమయాన్ని ఎంచుకున్నామని చెప్పారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని, ఎవరో భుజాలు తడుముకుంటే తాను ఏమీ చేయలేనని చెప్పారు. తాను మెంటార్‌గా ఉంటూ అన్ని వర్గాల వారికి అధికారం కట్టబెట్టేలా పనిచేస్తానని, ప్రజల ఆశీర్వాదంతో ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత అన్ని జిల్లాల నుంచి చేరికలు ఉంటాయన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

