న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వాటా కొనుగోలు చేసిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీవోకి రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ వాటా విక్రయం జరుగనున్నదని తెలిపింది. షేరు ధర శ్రేణిని రూ.870 నుంచి రూ.900గా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.7,249 కోట్ల నిధులు సమీకరించాలని సంస్థ భావిస్తున్నది. దీంట్లో రూ.100 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ఉద్యోగులకు కేటాయించింది.