హైదరాబాద్, నవంబర్ 21: క్రిటికల్ విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ గ్రూపు..హైదరాబాద్లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. రూ.300 కోట్ల పెట్టుబడితో హార్డ్వేర్ పార్క్లో ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మింతలపెట్టిన ప్లాంట్నకు గురువారం భూమి పూజ చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘు వంశీ గ్రూపు ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ..రూ.300 కోట్లతో ఉత్పత్తి కేంద్రంతోపాటు ఆర్అండ్డీ సెంటర్ను కూడా నెలకొల్పుతున్నట్లు, తద్వారా వచ్చే మూడేండ్లలో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.2 వేల కోట్లకు పైగా ఆర్డర్లు ఉన్నాయన్నారు.