e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News రాధా టీఎంటీ వంద కోట్ల పెట్టుబడి

రాధా టీఎంటీ వంద కోట్ల పెట్టుబడి

  • చేగుంట ప్లాంట్‌ కెపాసిటీని రెండింతలు పెంచుతున్న సంస్థ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న రాధా స్మెల్టర్స్‌.. చేగుంట సమీపంలో ఉన్న ప్లాంట్‌ సామర్థ్యాన్ని రెండింతలు పెంచుకోబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ఏడాదికి 4 లక్షల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుండగా, 2025 నాటికి ఈ కెపాసిటీని 10 లక్షల టన్నులకు పెంచుకోవడానికి రూ.100 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ ఎండీ సుమన్‌ సరాఫ్‌ తెలిపారు. ఈ నెల 6న మార్కెట్లోకి నూతన శ్రేణి 550 డీ ఎల్‌ఆర్‌ఎఫ్‌(లాడిల్‌ రిఫైనింగ్‌ ఫర్నేస్‌) టీఎంటీ బార్‌లను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం అంచనావేస్తున్న సంస్థ..వచ్చే ఏడాది రూ.1,500 కోట్లకు చేరుకోనున్నదని చెప్పా రు. గతేడాది ఇది రూ.530 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 250 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్య రెట్టింపు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సంస్థ రూ.75 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. తెలంగాణలో ప్రతియేటా 36 లక్షల టన్నుల స్టీల్‌ వినిమయం జరుగుతున్నది. దీంట్లో కంపెనీ మార్కెట్‌ వాటా 3-4 శాతంగా ఉండగా, వచ్చే రెండేండ్లలో 7-8 శాతానికి పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు. భూకంపాలను తట్టుకునేలా 550 డీ గ్రేట్‌ టీఎంటీ బార్‌లకు మార్కెట్లో ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement