PwC Report | భారత్‌లో 15శాతం వార్షిక వృద్ధిరేటుతో క్రెడిట్‌కార్డుల సంఖ్య 200 మిలియన్లకు చేరుతుందని పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. క్రెడిట్ కార్డుల పరిశ్రమ గత ఐదేళ్లలో గణనీయంగా విస్తరణ జరిగిందని.. ఇది కార్డుల సంఖ్యను రెట్టింపు చేసిందని తెలిపింది. ఈ జోరు భవిష్యత్‌లోను కొనసాగుతుందని.. రానున్న సంవత్సరాల్లో మార్కెట్ రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక పేర్కొంది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ మార్కెట్ 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి కార్డుల సంఖ్య రెట్టింపై.. 20కోట్ల చేరుతుందని అంచనా. ‘క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గత ఐదేళ్లలో 100శాతం వృద్ధిని సాధించింది. మార్కెట్ దీన్ని రెట్టింపు చేస్తుందని అంచనా. వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి చెందుతుంది’ అని నివేదిక తెలిపింది.
క్రెడిట్ కార్డుల జారీతో పాటు వాటి ద్వారా నిర్వహించే లావాదేవీలు సైతం గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. లావాదేవీల పరిమాణం, సంఖ్య 22 శాతం పెరిగింది. అయితే, లావాదేవీల విలువ 28శాతం పెరగ్గ.. కొత్త ఉత్పత్తులు, వినూత్న ఆఫర్లు, విస్తరణ ఈ వృద్ధికి కారణమని నివేదిక పేర్కొంది. క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన నేపథ్యంలో డెబిట్ కార్డ్ వినియోగం తగ్గుముఖం పట్టిందని కూడా నివేదిక పేర్కొంది. డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమాణం, విలువ రెండూ భారీగా పడిపోయాయి. దాంతో వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పును ప్రతిబింబిస్తుందని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డెబిట్ కార్డుల లావాదేవీల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 33శాతం తగ్గింది. డెబిట్‌కార్డులపై ఖర్చు 18శాతం తగ్గింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)కి పెరుగుతున్న జనాధరణ సైతం కార్డుల వినియోగం తగ్గడానికి కారణమని నివేదిక తెలిపింది.