హైదరాబాద్, జూలై 4: మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ తాజాగా హైదరాబాద్‌లో మరో నాలుగు స్క్రీన్లతో సినిమా హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ మాట్లాడుతూ..
తెలంగాణలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో రూ.75 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు, దీంతో మరో ఐదు మల్టీప్లెక్స్‌ల్లో 20 స్క్రీన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. తద్వారా 400 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.