Pure EV’s E-Pluto 7G Pro | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న టూ-వీలర్ తయారీ సంస్థ ‘ప్యూర్ ఈవీ (Pure EV)’ దేశీయ మార్కెట్లోకి ఈ-ప్లూటో 7జీ ప్రో స్కూటర్ (E-Pluto 7G Pro) ను ఆవిష్కరించింది. సింగిల్ చార్జింగ్‌తో 150 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. దీని ధర రూ.94,999గా ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా ప్యూర్ ఈవీ డీలర్ల వద్ద ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెలాఖరు నుంచి డెలివరీ మొదలవుతుంది.
న్యూ ప్యూర్ ఈవీ ‘ఈ-ప్లూటో 7జీ (E-Pluto 7G Pro) రెట్రో డిజైన్ లాంగ్వేజ్ తో రూపుదిద్దుకున్నది. రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ రౌండ్ ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్స్) తదితర ఫీచర్లు ఉంటాయి. బ్లాక్, గ్రే, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ స్కూటర్. ఎఐఎస్ 156 సర్టిఫైడ్ 3.0 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో రూపుదిద్దుకున్న స్కూటర్.. 1.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానమవుతుంది.
ఎంచుకున్న డ్రైవింగ్ మోడ్‌ను బట్టి సింగిల్ చార్జింగ్‌తో 100 నుంచి 150 కి.మీ. దూరం వరకు ప్రయాణం చేయవచ్చు. మూడు రైడింగ్ మోడ్స్ లో ఈ స్కూటర్ లభిస్తుంది. ఐదు సెకన్ల వ్యవధిలో 40 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలడం దీని సామర్థ్యం.