Bournvita | అది ఎంత మాత్రమూ హెల్త్ డ్రింక్ కాదు.. ఈ-కామర్స్ సంస్థలకు స్పష్టం చేసిన కేంద్రం
Bournvita | బోర్నవిటాతోపాటు ఇతర కూల్ డ్రింక్స్ / బేవరేజెస్‌ను హెల్త్ డ్రింక్ క్యాటగిరీ నుంచి తొలగించాలని ఈ-కామర్స్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆదేశించింది.
Bournvita | బోర్నవిటాతోపాటు ఇతర కూల్ డ్రింక్స్ / బేవరేజెస్‌ను హెల్త్ డ్రింక్ క్యాటగిరీ నుంచి తొలగించాలని ఈ-కామర్స్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆదేశించింది. ‘పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం-2005లోని మూడో సెక్షన్ కింద ఏర్పాటు చేసిన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) నిర్వహించిన విచారణ ప్రకారం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 ప్రకారం దేన్ని ‘హెల్త్ డ్రింక్’గా నిర్వచించలేదని తేలిందని ఈ నెల 10న కేంద్ంర జారీ చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. కనుక బోర్నవిటాతోపాటు ఇతర కూల్ డ్రింక్స్, బేవరెజెస్ను ‘హెల్త్ డ్రింక్’ క్యాటగిరీ నుంచి తొలగించాలని కేంద్రం ఈ-కామర్స్ సంస్థలను ఆదేశించింది.
బోర్నవిటాలో పంచదార ఎక్కువగా ఉందంటూ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఒక వీడియో పోస్ట్ చేయడంతో ఈ సంగతి బయట పడింది. బోర్నవిటాలోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నాడు. ఆ వ్యక్తికి బోర్నవిటా తయారీ సంస్థ మాండెలెజ్ ఇండియా లీగల్ నోటీసు పంపింది. దీంతో సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. ఆ వీడియోనూ అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి డిలిట్ చేసినా, దీనిపై ఫిర్యాదు అందడంతో ఎన్సీపీసీఆర్ విచారించింది. అనుమతించిన దానికంటే ఎక్కువగా బోర్నవిటాలో చక్కెర ఉందని గుర్తించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని మాండలెజ్ ఇండియాకు నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

