హైదరాబాద్, సెప్టెంబర్ 22: జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రెడీమేడ్ వస్ర్తాల ధరలను తగ్గించినట్టు సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ తెలిపారు. రెడీమేడ్ వస్ర్తాలపై గతంలో 12 శాతంగా ఉన్న జీఎస్టీని ప్రస్తుతం 5 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రూ. 2500లోపు దుస్తుల ధరలను 6.25 శాతం వరకు తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు చేరవేయడంలో సంస్థ ఎల్లప్పుడు ముందువుంటుందని, అలాగే దసరాకు ప్రత్యేక రాయితీలతో డిస్కౌంట్లు అందిస్తున్నట్టు చెప్పారు. రూ.999 కొనుగోలుపై స్పాట్గిఫ్ట్, వన్ ప్లస్ వన్ ఫార్లు, కాంబో ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు.