హైదరాబాద్, జనవరి 12 : రాష్ర్టానికి చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నది. సెల్, మాడ్యుల్ తయారీ సామర్థ్యాన్ని రెండింతలు పెంచుకోవడానికి రూ.11 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినయ్ రుస్తాగి తెలిపారు.
ప్రస్తుతం సంస్థ 3.2 గిగావాట్ల సెల్స్, 5.1 గిగావాట్ల మాడ్యుల్స్ సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లను హైదరాబాద్‌కు సమీపంలో నిర్వహిస్తున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా సెల్స్‌కు, మాడ్యుల్స్కు ఉన్న డిమాండ్‌తో వచ్చే ఐదేండ్లలో ఈ సామర్థ్యాన్ని 10.6 గిగావాట్ల సెల్స్, 11.1 గిగావాట్ల మాడ్యుల్స్‌ను పెంచుకోనున్నట్టు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 6 గిగావాట్ల మాడ్యుల్స్ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్టు చెప్పారు.