Pravaig EV SUV Daffi | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ ప్రవేగ్ డైనమిక్స్ మార్కెట్లోకి తొలి ఎస్యూవీ డాఫీ ఆవిష్కరించింది. ఇది వినియోగదారులకు రూ.39.50 లక్షలకు లభ్యం అవుతుంది. ఆసక్తి గల వారు రూ.50 వేలు చెల్లించి ఈ ఎస్యూవీ కారు బుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జి చేస్తే 500 కి.మీ. దూరం వరకు ప్రయాణించవచ్చు. గంటకు 210 కి.మీ. స్పీడ్తో దూసుకెళ్లగలదు. బ్యాటరీ 2.50 లక్షల కి.మీ. ప్రయాణ దూరం లైఫ్ కలిగి ఉంటుంది.
ప్రవేగ్ డాఫీ.. లార్జ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ కనెక్టివిటీ ఫంక్షన్స్, డెవియాలెట్ ఆడియో సిస్టమ్, ఎయిర్ ఫ్యూరిఫయర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, రేర్ ప్యాసింజర్లకు టచ్స్క్రీన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
90.2 కిలోవాట్ల బ్యాటరీ 402 బీహెచ్పీ పవర్, 620 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 30 నిమిషాల్లో 80 శాతం చార్జి అవుతుంది. ఇది మార్కెట్లోకి 11 రంగుల ఆప్షన్లలో లభ్యం అవుతుంది. మేడిన్ ఇండియా ఇన్సియేటివ్లో భాగంగా ఈ కారును తయారు చేసింది ప్రవేగ్. రెండు రోజుల క్రితం బెంగళూరులో అల్ట్రా వయ్ లెట్.. ఎఫ్77 పేరుతో మూడు వేరియంట్లలో ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ఆవిష్కరించింది.