Post Office Insurance | పోస్టాఫీసు ప్రమాద బీమా.. కవరేజీ ఎంతంటే?!
Post Office Insurance | రోడ్డు ప్రమాద బాధితుల కోసం టాటా ఏఐజీతో కలిసి రూ.399 ప్రీమియంతో తపాలాఫీసు రూ.10 లక్షల ప్రమాద బీమా తెచ్చింది.
Post Office Insurance | ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడితే సరి.. ఆ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. అటుపై మృత్యువాత పడితే.. ఆయా కుటుంబాల వేదన వర్ణనాతీతమే. ఇక యజమానిని కోల్పోతే ఆ కుటుంబం పూర్తిగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేయించుకుంటే.. తమ కుటుంబాలను ఆదుకున్న వారవుతారు. ఎల్ఐసీతో జీవిత బీమా.. తర్వాతీ క్రమంలో ఆరోగ్య సేవల కోసం హెల్త్ బీమా.. తాజాగా ప్రమాదాలతో సదరు వ్యక్తులు, వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడకుండా ప్రమాద బీమా స్కీమ్‌లు వచ్చేశాయి. ఈ రంగంలోకి తపాలాశాఖ కూడా వచ్చి చేరింది. ఇందుకోసం ప్రముఖ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ సంస్థతో జత కట్టింది.
పోస్టల్ పేమెంట్స్ ఖాతాదారులకే స్పెషల్
తపాలాఫీసు తన ఖాతాదారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డు పేరిట టాటా ఏఐజీ ఇన్సూరెన్స్‌తో కలిసి ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద ఏటా రూ.399 చెల్లిస్తే సరి. సదరు వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఈ పథకం కింద పాలసీదారులకు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. 18 ఏండ్లు దాటిన వారు మొదలు 65 ఏండ్ల లోపు వయస్కుల వరకు తపాలాఫీసు- టాటా ఏఐజీ వారి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ బీమా పాలసీలో చేరొచ్చు. ఈ పాలసీలో చేరగోరే వారు పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా తీసుకోవడం తప్పనిసరి. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచే ప్రీమియం చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ ప్రయోజనాలిలా
ఈ బీమా పాలసీ పొందిన వారు రోడ్డు ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగ వైకల్యం చెందినా, పక్షవాతానికి గురైనా, ఏదైనా అవయవాన్ని కోల్పోయినా రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది తపాలాఫీసు. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న ఇన్పేషంట్కు ఐపీడీ కింద గానీ, క్లయిమ్ రూపేణా గానీ రూ.60 వేలు.. వీటిలో ఎది తక్కువైతే అది చెల్లిస్తుంది. దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి పది రోజుల వరకు రోజూ రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఔట్ పేషంట్‌గా చికిత్స పొందుతున్నట్లైతే రూ.30 వేలు గానీ, క్లయిమ్ రూపంలో గానీ.. ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.
రూ.299తోనూ రూ.10 లక్షల ప్రమాద బీమా..కానీ
అత్యధికంగా ఇద్దరు పిల్లల విద్యా సంబంధ అవసరాల కోసం మొత్తం బీమా పాలసీలో 10 శాతం అంటే రూ. లక్ష చెల్లిస్తారు. కుటుంబ ప్రయోజనాల కోసం రూ.25 వేలు, మరణించిన వ్యక్తి అంత్య క్రియల కోసం రూ.5000 పే చేస్తారు. ఈ బీమా పాలసీలో తపాలాఫీసు మరో ఆప్షన్ కల్పించింది. రూ.299 లకే రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఇందులో మరణం, శాశ్వత అంగ వైకల్యం, పక్షవాతం వంటి అంశాలకు కవరేజీ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

