Poco M6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్లో 64 జీబీ వేరియంట్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గతేడాది డిసెంబర్ లోనే 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో ఆవిష్కరించింది. తాజాగా ఆవిష్కరించనున్న 64 జీబీ స్టోరేజీ వేరియంట్ పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని భావిస్తున్నారు. ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా, విత్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వస్తోంది.
పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ కొత్తగా 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ఈ నెల 20 అర్ధరాత్రి 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ మార్కెట్లోకి ఎంటర్ కానున్నది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.8,999 పలుకుతుందని భావిస్తున్నారు. పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ గాలక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ, పొలారిస్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 260పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంయూఐ 14 వర్షన్ పై పని చేస్తుంది. ఏఐ బ్యాక్డ్ ప్రైమరీ 50-మెగా పిక్సెల్స్ మెయన్ కెమెరా, అన్ స్పెషిఫైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ 18వాట్ల వైర్డ్ చార్జింగ్ పై పని చేస్తుంది. 5జీ, 4ఎల్టీఈ, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది.