eKYC for PM Kishan | పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తున్నది. పూర్తిగా 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పని చేస్తున్న పథకం ఇది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాతోపాటు ప్రతి ఆర్థిక లావాదేవీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లబ్ధిదారుల ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఈ గడువును వచ్చేనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఈ-కేవైసీ అప్డేట్ గడువు పొడిగించిన తర్వాత ఈ-కేవైసీ ఆప్షన్ సుదీర్ఘకాలం పని చేయడం లేదు. పీఎంకిసాన్ రిజిస్టర్డ్ రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ సబ్మిట్ చేయాల్సిందే. కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు తమ సమీప సీఎస్సీ సెంటర్లలో బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఓటీపీ ద్వారా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ అథంటికేషన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పీఎం కిసాన్ వెబ్సైట్ పేర్కొన్నది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులు సమీప కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి ఆఫ్లైన్లో ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11వ ఇన్స్టాల్మెంట్ పొందడానికి లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి.