హైదరాబాద్, ఏప్రిల్ 14: వాటర్ స్టోరేజీ ట్యాంకులు, పైపుల తయారీలో ప్రముఖ సంస్థ ప్లాస్టో.. మార్కెట్లోకి సరికొత్త సూపర్ కూల్ ట్యాంకులను తీసుకొచ్చింది. 6 లేయర్ డబుల్ ఫోమ్ టెక్నాలజీతో ఉన్న ఈ ట్యాంకుల వల్ల వినియోగదారులు నీటికి అదనపు చల్లదనాన్ని చవిచూడగలరని సంస్థ చెప్తున్నది.
అంతేగాక సూర్యుడి నుంచి విడుదలయ్యే ఆరోగ్యానికి హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచీ రక్షణ లభిస్తుందని ప్లాస్టో ఈ సందర్భంగా ఓ ప్రకటనలో పేర్కొన్నది. అన్ని ఆథరైజ్డ్ ప్లాస్టో డీలర్ స్టోర్ల వద్ద ఈ ట్యాంకులు లభిస్తాయన్నది. మరిన్ని వివరాల కోసం www.plasto.in సందర్శించవచ్చు. 7767007071 వాట్సాప్ నెంబర్ను సంప్రదించవచ్చు.