హైదరాబాద్, ఆగస్టు 19: మానవ వనరుల సేవల సంస్థ ఫెనోమ్..భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐతో సేవలను అందించబోతున్నది. ఇందుకోసం టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయడానికి, ప్రతిభ, ఇన్నోవేషన్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ మహి బైరెడ్డి తెలిపారు.
తెలంగాణలో తమ కార్యకలాపాల విస్తరణతోపాటు, రాబోయే రోజుల్లో దేశంలో 2వేలకు పైగా అదనపు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని సంస్థ యోచిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివర్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘IAMPHENOM ఇండి యా 2026లో’ సంస్థ భవిష్యత్తు ప్రణాళికను ప్రదర్శించబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థ 500కి పైగా టెక్నాలజీ, హెల్త్‌కేర్, రిటైల్, హాస్పిటాల్టీ, తయారీ, యుటిలిటీ తదితర సంస్థలకు సేవలు అందిస్తున్నది.