Personal Finance | డబ్బులు చాలట్లేదని ఖర్చులు తగ్గించుకోవడం కాదు.. సంపాదన పెంచుకోవాలి
Personal Finance | ఖర్చు విషయంలో రెండే పరిష్కారాలు. అవసరాలు తగ్గించుకోవడం. సంపాదన పెంచుకోవడం. అవసరాలను తగ్గించుకుంటూ పోతే.. చివరికి కూడు, గూడు, బట్ట విషయంలోనూ రాజీపడాల్సి వస్తుంది. అదే, సంపాదన పెంచుకుంటే జీవితం సంతోషమయం అవుతుంది. కాబట్టి, సంపాదనకు పరిమితి పెట్టుకోకండి, అవసరమైన ఖర్చులకూ పరిమితులు విధించుకోకండి.
Personal Finance | ఖర్చు విషయంలో రెండే పరిష్కారాలు. అవసరాలు తగ్గించుకోవడం. సంపాదన పెంచుకోవడం. అవసరాలను తగ్గించుకుంటూ పోతే.. చివరికి కూడు, గూడు, బట్ట విషయంలోనూ రాజీపడాల్సి వస్తుంది. అదే, సంపాదన పెంచుకుంటే జీవితం సంతోషమయం అవుతుంది. కాబట్టి, సంపాదనకు పరిమితి పెట్టుకోకండి, అవసరమైన ఖర్చులకూ పరిమితులు విధించుకోకండి.
ఏం ఫర్వాలేదు.. సినిమాలు చూడండి. షికార్లు చేయండి. షాపింగ్ వెళ్లండి. అవసరమైనవన్నీ కొనేయండి. ఖర్చు చేయడంలో తప్పులేదు. ఖర్చు వృథా కానేకాదు. నాణ్యమైన వస్త్రాలు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలతో సమయం కలిసొస్తుంది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తే నెట్వర్క్ విస్తరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడి నుంచి బయటపడతాం. ఫీజు కొంత ఎక్కువైనా మంచి స్కూల్స్‌లో చేర్పిస్తే బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లం అవుతాం. మనకంటూ ఓ కారు ఉంటే.. సకుటుంబంగా బయటికి వెళ్తాం. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తాం. దీనివల్ల బంధాలు బలపడతాయి. ఇరుకిరుకు పోర్షన్ నుంచి విశాలమైన ఇంటికి మారడం వల్ల.. గాలి, వెలుతురు ఆస్వాదిస్తాం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ మనకోసం మనం పెట్టుకునే అత్యుత్తమ పెట్టుబడులు. కాబట్టి, అస్సలు రాజీపడకూడదు, ఏమాత్రం వెనుకాడకూడదు. పొదుపు పేరుతో నాసిరకం జీవితానికి అలవాటు పడకూడదు. కాకపోతే ఆ ఖర్చుకు పరిమితి ఉండాలి.
రేపటి సంపాదనతో కాదు
మన ప్రస్తుత సంపాదననే మనం ఖర్చు చేయాలి. నెల తర్వాత రాబోయే జీతాన్ని పరిగణనలోకి తీసుకుని, రెండు నెలల తర్వాత మేనేజ్మెంట్ ప్రకటించే బోనస్‌ను దృష్టిలో ఉంచుకుని, మూడునెలల తర్వాత చేతికందే వ్యవసాయ రాబడిని లెక్కగట్టి అర్థంలేని ఖర్చులు చేయడం మాత్రం ఘోరమైన తప్పు. సరిగ్గా అక్కడినుంచే మన ఆర్థిక అపసవ్య దిశ మొదలవుతుంది. నీ జీతం ఎంతైనా కావచ్చు. కానీ, దానికి సరిపడా ఖర్చులూ ఉంటాయి. అదనపు రాబడి లేకుండా, అదనపు ఖర్చులను సర్దుబాటు చేయడం అసాధ్యం. బోనస్ అంటారా? కొవిడ్ తర్వాత యాజమాన్యాల ఆలోచనా విధానం మారిపోయింది. ఉదారగుణం తగ్గిపోయింది. భవిష్యత్తు పట్ల భయం మొదలైంది. చట్టపరంగా తప్పనిసరి అయితే తప్ప బోనస్‌లు, ప్రోత్సాహకాల జోలికి వెళ్లడం లేదు. ఆ ‘తప్పనిసరి’ని తప్పించుకునే చిట్కాలూ వెతుక్కుంటున్నారు. కాబట్టి, బోనస్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోకండి. వ్యవసాయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చేతికొచ్చిన పంట నోటికొస్తుందన్న భరోసా లేదు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధరలు, చీడపీడలు.. వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి, నీ ఖాతాలో ఉన్న డబ్బు మాత్రమే నీది. అది కూడా.. బ్యాంకు వాయిదాలు, బీమా ప్రీమియంలు, అద్దెలు, స్కూలు ఫీజులు, మందులు, పాలబిల్లు, కేబుల్ బిల్లు, సిప్, స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్మెంట్.. వగైరా వగైరా కేటాయింపుల తర్వాత మిగిలేదే నీది. ఆ సొమ్ముతో షాపింగ్ చేస్తావో, మాలే కొంటావో నీ ఇష్టం.
ప్లాస్టిక్ మనీ వద్దు
వ్యక్తుల ఖర్చుల వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కొత్త కంపెనీలు వస్తాయి. నలుగురికి ఉపాధి లభిస్తుంది. దేశానికి కూడా మంచిదే. కాకపోతే ముందుగా మన అవసరాలకు, బాధ్యతలకు ఖర్చు పెట్టాలి. ఆ తర్వాతే వినోదాలు, విలాసాలు, జీవనశైలి వ్యయాలు. అందులోనూ క్రెడిట్‌కార్డు గీకుడుకు అలవాటు పడితే.. ఆర్థిక ఊబిలో చిక్కుకుపోయినట్టే. గడువు తేదీలోగా చెల్లించలేక.. ఆ మొత్తాన్ని ఈఎమ్ఐగా మార్చుకుంటాం. దీంతో నెలవారీ చెల్లింపులు మోయలేనంత భారంగా మారిపోతాయి. కొత్త అప్పులు అవసరం అవుతాయి. వడ్డీల మోత మొదలవుతుంది. ఖర్చు పెట్టాలన్న కోరిక ఉండటంలో తప్పులేదు. అదే సమయంలో సంపాదించాలనే తపన కూడా ఉండాలి. అదనపు సంపాదన మార్గాల గురించి ఆలోచించాలి. కొత్త అవకాశాల వైపు అడుగులు వేయాలి. అంతేకానీ, గాల్లో లెక్కలేసుకుంటూ.. కాలిమీద కాలేసుకుని కూర్చోవడం మంచిది కాదు. ఆ బాధ్యతలేని తనమే ఏదో ఒకరోజు మనల్ని ముంచేస్తుంది. నిజానికి మనం స్వతహాగా జాగ్రత్తపరులమే. ఎస్ఐపీ పెట్టుబడులు పదిహేనువేల కోట్లకు చేరాయి. బీమా రంగం బలపడింది. రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇవన్నీ మంచి పరిణామాలే. కాకపోతే, చేతిలోని సంపాదనలోంచే ఖర్చుపెట్టాలి. ఆ మాత్రం బాధ్యత ఉంటే చాలు. జీవితానికి పొదుపు-మదుపు ఎంత అవసరమో, ఖర్చులూ అంతే అవసరం. ప్రతిదానికీ రాజీపడుతూ కూర్చుంటే.. ఆత్మన్యూనత నెత్తినెక్కుతుంది. జీవితంలో సర్దుబాటు సరికాదు. మనం సాంకేతిక యుగంలో ఉన్నాం.. చేతిలో నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు. నైపుణ్యం లేకపోయినా బాధపడుతూ కూర్చోవాల్సిన పన్లేదు. నైపుణ్యం పెంచుకునే మార్గాలు అనేకం. ఆన్లైన్ కోర్సులున్నాయి. ఆఫ్‌లైన్ చదువులున్నాయి. మీరిప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటి హీరో కాదు. దారిద్య్రాన్ని తిట్టుకుంటూనో, నిరుద్యోగాన్ని ఎత్తిచూపుతూనో, పేదరికాన్ని ప్రేమిస్తూనో, కుబేరుల్ని ద్వేషిస్తూనో బతికేయడానికి. సంతోషంగా జీవించడానికి ఎంత ఖర్చు చేయాలో అంత చేయండి. సంతృప్తిగా జీవించడానికి ఎంత డబ్బు అవసరమో అంత సంపాదించండి. ఖర్చు తగ్గించుకుని కోటీశ్వరులైనవారు ఎక్కడా కనిపించరు. సంపాదన పెంచుకున్నవారే ఆర్థిక విజేతలు అవుతారు. కుటుంబసభ్యుల ప్రేమను, బంధువుల ఆదరాన్ని పొందుతారు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Personal Finance Tips | కట్టిన ఇల్లు కొంటే లాభమా? కడుతున్నప్పుడే ఇంటిని బుక్ చేసుకుంటే బెటరా?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

