హైదరాబాద్, మే 23: ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ పియర్సన్..హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ను నెలకొల్పింది. తెలంగాణలో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఈ సెంటర్ను నెలకొల్పినట్టు, ఇప్పటికే వందకు పైగా ఇనిస్టిట్యూట్లతో ఒప్పందం చేసుకొని నైపుణ్యాభివృద్ధి సేవలు అందిస్తున్నట్టు కంట్రీ హెడ్ వినయ్ తెలిపారు.
బీటెక్ కోర్సులు, అండర్ గ్రాడ్యుయేట్, మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ కోర్సులకు అవసరమైన కంటెంట్ అందిస్తున్నది. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలలో 1,300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.