Paytm-Rupay Credit Card | పేటీఎంతో రూపే క్రెడిట్ కార్డు పేమెంట్స్‌కు ఓకే
Paytm-Rupay Credit Card | రూపే క్రెడిట్ కార్డుతో పేటీఎం యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
Paytm-Rupay Credit Card | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు ఇక నుంచి తమ రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అనునిత్యం లక్షల మంది వినియోగదారులు యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రూపే క్రెడిట్ కార్డులను దీని పరిధిలోకి తేవడం డిజిటల్ పేమెంట్స్ మరింత విస్తరించడానికి వీలు కలుగుతుంది. తాజా నిర్ణయం ప్రకారం యూజర్లు తమ రూపే క్రెడిట్ కార్డులను డైరెక్టుగా యూపీఐ ఐడీ లింక్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో తేలిగ్గా వ్యాపారులకు పేమెంట్స్ చేసేయవచ్చు.
ప్రస్తుతం ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ రూపే క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. పేటీఎం వంటి మొబైల్ యాప్స్‌లో పేమెంట్ సౌకర్యం కల్పించడం వల్ల రూపే క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. పేటీఎంతోపాటు మొబిక్విక్ కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.
యూజర్లు తమ రూపే క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. నిరంతరాయ, సురక్షితమైన లావాదేవీల కోసం యూజర్లు తమ క్రెడిట్ కార్డులను యూపీఐ ఐడీతో లింక్ చేస్తే సరిపోతుంది. అటుపై మర్చంట్స్ వద్ద యూపీఐ క్యూఆర్ కోడ్‌ను పేటీఎం యాప్‌తో స్కాన్ చేస్తే సరిపోతుంది. షాపింగ్ చేయడానికి వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. యూపీఐ ఐడీ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డులతో ఆఫ్ లైన్, ఆన్ లైన్ పేమెంట్స్ తేలికవుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

