Patanjali Smartphone | సోషల్ మీడియాలో ఇటీవల ఓ వార్త హల్చల్ చేస్తున్నది. ఇది అందరినీ షాక్‌కు గురి చేస్తున్నది. యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి కంపెనీ తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లతో 6జీ స్మార్ట్‌ఫోన్ విడుదుల చేయబోతుందని వార్త చక్కర్లు కొడుతున్నది. 250 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 200 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వివరాల ప్రకారం పతంజలి స్మార్ట్ మొబైల్ రియర్‌లో 250 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 13మెగా పిక్సల్, 33 మెగా పిక్సల్ సపోర్టింగ్ కెమెరా, సెన్సార్లతో పాటు ఫ్రంట్‌లో 28 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 6.74-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే (144Hz రిఫ్రెష్ రేట్), మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, టీబీ స్టోరేజ్, 7000mAh బ్యాటరీ, కేవలం 15 నిమిషాల్లో 100 శాతం చార్జ్ చేసే 200W ఛార్జింగ్ సపోర్ట్‌తో మొబైల్‌ను లాంచ్ చేనున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఈ ఫోన్ ధర కేవలం రూ.25వేల నుంచి రూ.33వేల వరకు ఉంటుందని.. పతంజలి యాప్‌లో ఫోన్లో ఇన్‌బిల్డ్ యాప్స్‌గా వస్తాయంటూ పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ అని మార్కెట్‌కు చెందిన పలువురు పేర్కొంటున్నారు. పతంజలి ఆయుర్వేదం, అనుబంధ సంస్థ ఇప్పటి వరకు అధికారికంగా స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లోకి వస్తున్నట్లు ప్రకటించలేదు. అయితే, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 6జీ టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం పరిశోధనా, అభివృద్ధి దశలోనే ఉన్నది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆపిల్, శామ్సంగ్ సైతం 6జీకి సైతం సిద్ధంగా లేదు. ఈ పరిస్థితుల్లో పతంజలి వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీ అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడం అసాధ్యమే. అయితే, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై ఇప్పటి వరకు కంపెనీ సైతం స్పందించలేదు.