హైదరాబాద్, జనవరి 6: న్యూసిలియన్ థెరప్యూటిక్స్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది పాండోరమ్ టెక్నాలజీస్. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కంటి వ్యాధుల కోసం ఎక్సోసోమ్ ఆధారిత కణజాల పునరుత్పత్తి చికిత్సను అందించడానికి వీలు పడనున్నది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కణజాల పునరుత్పత్తి కోసం తదుపరి ప్లాట్ఫామ్ కోసం క్లినికల్ దశలో ఉన్నదని పాండోరమ్ సీఈవో తుహిన్ భౌమిక్ తెలిపారు.