Oyo | జొమాటో బాటలో ఒయో.. 600మంది ఉద్యోగులను తొలగించనున్న సంస్థ
సేల్స్ విభాగంలో 250 మంది కొత్తవాళ్లను తీసుకోనున్న ఒయో
Oyo : టెక్, సోషల్‌మీడియా సంస్థలతో పాటు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో కూడా ఈమధ్య భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా హోటల్ సర్వీస్ అందించే ఒయో కంపెనీ కూడా ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్టు ఒయో శనివారం వెల్లడించింది. అంటే.. ప్రస్తుతం ఉన్న 3,700 మందిలో 10 శాతం మంది ఇంటిదారి పట్టనున్నారు. అంతేకాదు సేల్స్ విభాగంలో 250 మంది కొత్తవాళ్లను తీసుకుంటామని కంపెనీ తెలిపింది. వీళ్లకు వ్యాపార వృద్ధి, అనుబంధాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనుంది. కంపెనీని లాభాల బాట పట్టించేందుకు, నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు ఒయో ఈమధ్య భారీ మార్పులు చేపట్టింది. ఆ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రొడక్ట్, ఇంజనీర్ల మీద ప్రభావం పడనుంది.
ఒయో స్టార్టప్‌ను రితేశ్ అగర్వాల్ 2012లో ప్రారంభించాడు. ఒయో రూమ్స్‌ను హోటల్స్, హోమ్ అని కూడా పిలుస్తారు. హోటళ్లను లీజుకు లేదా ఫ్రాంఛైజ్‌కు ఇస్తుంది. ఒయో అధికారులు మొదట్లో బడ్జెట్ హోటళ్లకే ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. 2020 నాటికి 80 దేశాల్లోని 800 పట్టణాలకు ఒయో కంపెనీ విస్తరించింది. ప్రస్తుతం ఒయో చేతిలో 10 లక్షలకు పైగా రూమ్స్ ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

