Osamu Suzuki | న్యూఢిల్లీ, జనవరి 25: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకీ (ఇటీవల మరణించారు)కి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ ఆటోమొబైల్ రంగంలో విశేష కృషి చేసిన ఆయనకు దేశంలో రెండో అతిపెద్ద అవార్డును ప్రకటించడం విశేషం. దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషించిన పది మందికి పద్మా అవార్డులు అందించబోతున్నది మోదీ సర్కార్. వీరిలో ఒసాముకు పద్మ విభూషణ్, మరో ఇద్దరికి పద్మభూషణ్, మరో ఏడుగురికి పద్మ అవార్డులు ప్రకటించింది.
పారిశ్రామిక పద్మాలు వీరే