Oppo Reno 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో 13 5జీ (Oppo Reno 13 5G) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఈ నెల తొమ్మిదో తేదీన ఆవిష్కరించనున్నది. ఒప్పో రెనో 13 5జీ (Oppo Reno 13 5G),తోపాటు ఒప్పో రెనో 13 (Oppo Reno 13), ఒప్పో రెనో 13 ప్రో (Oppo Reno 13 Pro) ఫోన్లు కూడా ఆవిష్కరిస్తారు. ఈ ఫోన్లలో ఒప్పోస్ సిగ్నల్ బూస్ట్ ఎక్స్1 చిప్స్తోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎస్వోసీ ప్రాసెసర్లు ఉంటాయి. గత నవంబర్‌లో చైనాలో ఈ ఫోన్లను ఆవిష్కరించారు.
ఒప్పో రెనో 13 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.37,999, 8జీబీ ర్యామ్ విత్ 256జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999 పలుకుతుందని భావిస్తున్నారు. ఇక ఒప్పో రెనో 13ప్రో 5జీ ఫోన్ విత్ 12 జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.49,999, 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ అండ్ 512జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.54,999 పలుకుతాయి.
ఒప్పో రెనో 13 5జీ, ఒప్పో రెనో 13ప్రో 5జీ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎస్వోసీ ప్రాసెసర్లు, ఇన్ హౌస్ సిగ్నల్ బూస్ట్ ఎక్స్1 చిప్స్‌తో వస్తున్నాయి. ఒప్పో రెనో 13 5జీ ఫోన్ 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఒప్పో రెనో 13ప్రో 5జీ 5880 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీస్ విత్ 80వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతు కలిగి ఉంటాయి.
ఒప్పో రెనో 13ప్రో 5జీ ఫోన్ 50మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా విత్ 3.5x ఆప్టికల్ జూమ్ అప్ టూ 120ఎక్స్ డిజిటల్ జూమ్, గ్రాఫైట్ గ్రే, మిస్ట్ లావెండర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో రెనో 13 5జీ ఫోన్ ఐవోరీ వైట్, లుమినియస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్‌ల్లో ఈ ఫోన్లు లభిస్తాయి.