OnePlus Nord N30 SE | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ తన వన్ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ ఫోన్ సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్, 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేసన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటది. రెండు కలర్ ఆప్షన్లలో సింగిల్ ర్యామ్ వేరియంట్ గా వస్తున్నది. గతేడాది అక్టోబర్ లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తున్న వన్ ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ ఫోన్ ధర సుమారు రూ.13,600 (599 ఏఈడీ) పలుకుతుంది. శాటిన్ బ్లాక్, సియాన్ స్పార్కిల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400 x1080 పిక్సెల్స్) ఎల్సీడీ ప్యానెల్ విత్ 391 పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 వర్షన్ పై పని చేస్తుంది.
వన్ ప్లస్ ఎన్30 నార్డ్ ఎస్ఈ ఫోన్ 50-మెగా పిక్సలె్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కలిగి ఉంటది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుంది. 5జీతోపాటు జీపీఎస్, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.