OnePlus Speaker | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) త్వరలో కొత్త స్పీకర్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నదని సమాచారం. ఇప్పటికే పలు వైర్డ్, వైర్ లెస్ ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు విక్రయిస్తున్నది. ఈ ఏడాది నార్డ్ బడ్స్ 2 ఆర్, నార్డ్ బడ్స్2 అనే స్పీకర్లు ఆవిష్కరించిన వన్‌ప్లస్.. తాజాగా వన్‌ప్లస్ బడ్స్3 మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధం చేసింది. ఈ స్పీకర్ విడుదలపై సోషల్ మీడియా వేదిక ‘ఇన్స్టాగ్రామ్’ బుల్లి వీడియో రిలీజ్ చేసింది. దాని డిజైన్ కూడా బయట పెట్టింది. ‘గెట్ రెడీ టూ మేక్ సమ్ మ్యూజిక్’ అనే క్యాప్షన్‌తో టీజర్ రిలీజ్ చేసింది. కమింగ్ సూన్ అనే ట్యాగ్ తోపాటు ‘ది వండర్ ఆఫ్ మ్యూజిక్ మీట్స్ ది పవర్ ఆఫ్ టెక్’ అనే ట్యాగ్ లైన్ జత చేసింది.
వన్ ప్లస్ బడ్స్3 స్పీకర్ మెటాలిక్ ఫినిష్‌తో వస్తుందని సమాచారం. 48డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సీ) మద్దతుతో బ్లూటూత్ 5.3 ేలేదా గూగుల్ ఫాస్ట్ ఫెయిర్, డ్యుయల్ కనెక్షన్ మద్దతు కలిగి ఉంటుంది. ప్రతి బడ్ 58 ఏంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 520 ఎంఏహెచ్ చార్జింగ్ సెల్ ఉంటుది. 33 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటదని తెలుస్తున్నది. ప్రస్తుతం వన్ ప్లస్ నార్డ్ 2ఆర్ రూ.2,199, నార్డ్ బడ్స్ 2 రూ.2,999లకు లభిస్తాయి. నార్డ్ బడ్స్ 2ఆర్ డీప్ గ్రే, ట్రిపుల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. నార్డ్ బడ్స్2 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్, 36 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది.