OnePlus Community Sale | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, టాబ్లెట్స్ తదితర డివైజ్లతో కూడిన కమ్యూనిటీ సేల్ ప్రకటించింది. ఈ నెల ఆరో తేదీన మొదలై 17వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ కమ్యూనిటీ సేల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. సాధారణ డిస్కౌంట్లతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రాయితీలు ఉన్నాయి. సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మీద 12 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఆఫర్లు వర్తిస్తాయి. వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మైంత్రా వంటి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్లతోపాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసిన వారికి ఆఫర్లు లభిస్తాయి.
వన్ ప్లస్ 12 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.64,999లకు లాంచ్ చేసింది. తాజా కమ్యూనిటీ సేల్లో రూ.6,000 ధర తగ్గింపు ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు యూజర్లకు రూ.7,000 డిస్కౌంట్తో రూ.59,999లకు లభిస్తుంది.
వన్ ప్లస్ 12ఆర్ ఫోన్ ధరపై రూ.6,000, బ్యాంకు డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.35,999 పలుకుతుంది. వన్ ప్లస్ నార్డ్ 4 సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.3,000 ధర తగ్గింపు, ఇన్ స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ రూ.2,000 లభిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ మీద కమ్యూనిటీ సేల్ డిస్కౌంట్ రూ.2000, ఇన్ స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ రూ.1,000తో రూ.24,999 నుంచి రూ.22,999లకు దిగి వస్తుంది. దీంతోపాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ పొందొచ్చు.
వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ ధర రూ.1,49,999కి బదులు రూ.1,34,999లకు సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్ పాడ్ గో రూ.37,999 నుంచి రూ.27,999లకు తగ్గించారు. వన్ ప్లస్ పాడ్ 2, వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ మీద రూ.2,000 ధర తగ్గింపు ఉంటుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ కొనుగోలు దారులకు రూ.1000 ఇన్ స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ తోపాటు వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జడ్ 2 ఇస్తారు.
కమ్యూనిటీ సేల్లో భాగంగా వన్ ప్లస్ వాచ్ 2, వన్ ప్లస్ వాచ్2ఆర్ లపై రూ.3,000 ధర తగ్గించింది. అదనంగా వన్ ప్లస్ వాచ్2పై రూ.3,000, వన్ ప్లస్ వాచ్2ఆర్ పై రూ.2000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్ ప్లస్ వాచ్2 ధర రూ.24,999 నుంచి రూ.20,999లకు దిగి వచ్చింది.
వన్ ప్లస్ బడ్స్ ప్రో3పై రూ.1,000 ధర తగ్గింపుతోపాటు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000తో కలిపి దాని ధర రూ.11,999 లకు తగ్గింది. ఇక వన్ ప్లస్ బడ్స్ ప్రో2 లాంచింగ్ ధర రూ.11,999 కాగా రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు.