న్యూఢిల్లీ : పండగ సీజన్ ఆఫర్లతో క్రేజీ డీల్స్ అందిస్తూ వన్‌ప్లస్ (OnePlus Diwali Sale) కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దివాళీ ఫెస్టివ్ సీజన్ ఆఫర్లలో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 3, నార్డ్ సీఈ 3 ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లు, ట్యాబ్లెట్స్, టీవీలు సహా తన ప్రోడక్ట్స్ అన్నింటిపై వన్‌ప్లస్ బ్రాండ్ ప్రత్యేక డిస్కౌంట్స్ ప్రకటించింది. నవంబర్ 2న వన్‌ప్లస్ దివాళీ సేల్ లైవ్‌లోకి రాగా నవంబర్ 19 వరకూ కొనసాగనుంది. న్యూ వన్‌ప్లస్ ప్రోడక్ట్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది మెరుగైన అవకాశమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 వంటి హాట్ డివైజ్‌లపై ఊరించే డిస్కౌంట్‌ను వన్‌ప్లస్ ఆఫర్ చేస్తోంది. ఆకర్షణీయ ధరలో ఈ రెండు ఫోన్లు అద్భుత ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వన్‌ప్లస్ ఫెస్టివ్ ఆఫర్‌లోభాగంగా వన్‌ప్లస్ నార్డ్ 3 5జీపై రూ. 3000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 3000 స్పెషల్ ప్రైస్ కూపన్ డిస్కౌంట్‌ను కూడా కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నారు.
దీనికి తోడు ఆరు నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐతో ఫోన్‌ను సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3ని రూ. 2000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 2500 స్పెషనల్ ప్రైస్ కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్‌పై రూ. 1500 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుండగా వన్‌ప్లస్ 11 ఆర్ 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ సోలార్ రెడ్ స్పెషనల్ ఎడిషన్ ఫోన్లపై కూడా ఆకర్షణీయ ఆఫర్లు లభిస్తున్నాయి.
Read More :
Tiger | పులితో బాలుడి వాకింగ్.. షాకింగ్ వీడియో వైరల్