OnePlus 12R | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్ ప్లస్ 12ఆర్ (OnePlus 12R) ఫోన్ కొత్త కలర్ ఆప్షన్లో రానున్నది. గత జనవరిలో వన్ ప్లస్ 12 ఫోన్‌తో భారత్ మార్కెట్లోకి ఎంటరైన వన్ ప్లస్ 12 ఆర్ ఫోన్ కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం అవుతుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ ఎస్వోసీ, 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది. 100వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. తాజాగా వన్ ప్లస్ 12 ఆర్ ఫోన్ భారత్ మార్కెట్లోకి సన్ సెట్ డ్యూన్ కలర్ ఆప్షన్ తో రానున్నది. ఈ ఫోన్ వన్ ప్లస్ ఏస్3 ఫోన్ మినిషా గోల్డ్ ఫినిష్ రంగును పోలి ఉంటుందని భావిస్తున్నారు.
గత జనవరిలో మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ 12 ఆర్ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999, 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.45,999లకు లభిస్తుంది. ప్రస్తుతం 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో రూ.39,000 వద్ద లిస్టయింది. వన్ ప్లస్ 12 ఆర్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 6.78 అంగుళాల 1.5 కే (1264×2780 పిక్సెల్స్) ఎల్టీపీఓ 4.0 అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 50-మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది.