OnePlus 10R | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’ తన వన్ ప్లస్ 10ఆర్ (OnePlus 10R) మోడల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నది. ఈ-కామర్స్ జెయింట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్లు లభిస్తాయి.
గతేడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ 10ఆర్ (OnePlus 10R) ఫోన్ లాంచింగ్ ధర రూ.38,999. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్‌పై డిస్కౌంట్ అందుబాటులో ఉన్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకుంటే ఫోన్ రూ.30,798లకే సొంతం అవుతుంది. దీనిపై బేసిక్‌గా రూ.8,201 డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి అదనంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.34,999లకే సొంతం అవుతుంది. అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి రూ.4000 కూపన్ క్లిక్ చేస్తే ధర రూ.30,999కి చేరుతుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు లేదా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.2,000 డిస్కౌంట్ అందిస్తుంది. అంటే రూ.28,999లకే వన్ ప్లస్ 10 ఆర్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
సాధారణంగా రోజువారీ అవసరాలకు వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ అద్భుతమైందని చెబుతున్నారు. ఈ ఫోన్ 80వాట్ల ఫాస్ట్ చార్జర్ తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్, బ్లోట్ వేర్ -ఫ్రీ యూజర్ ఇంటర్ ఫేస్, 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.