న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: రిలయన్స్‌తో సాంకేతిక భాగస్వామ్యంలో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ గురువారం ఓ హైడ్రోజన్ బస్‌ను ఆవిష్కరించింది. తద్వారా సంప్రదాయ ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయంగా కర్బన రహిత వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినైట్టెంది.
భారతీయ మార్కెట్‌కు తర్వాతి తరం రవాణా వ్యవస్థను పరిచయం చేయడమే మా లక్ష్యమని ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. వీటిల్లో 32 నుంచి 49 సీట్లుంటాయి. ఒక్కసారి హైడ్రోజన్‌ను నింపితే బస్సు 400 కిలోమీటర్లదాకా ప్రయాణిస్తుంది. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది.