Ola S1 Air | ఓలా ఎస్1 ఎయిర్ ఈవీ స్కూటర్ బుకింగ్స్ 28 నుంచి ప్రారంభం
Ola S1 Air | ఎస్1 ఎయిర్ స్కూటర్ బుకింగ్స్ కోసం ఓలా ఎలక్ట్రిక్ స్పెషల్ విండో ప్రారంభిస్తోంది. ఈ నెల 28 నుంచి 30 వరకు పరిమితమైన గడువు విధించింది.
Ola S1 Air | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్కూటర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ తన మూడో ఈవీ స్కూటర్ ‘ఎస్1 ఎయిర్ (Ola S1 Air) బుకింగ్స్ ప్రారంభించనున్నది. ఈ స్కూటర్ కొనుగోలుకు పరిమితమైన బుకింగ్ టైం విండో అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బుక్ చేసుకున్న వారికి రూ.10 వేల డిస్కౌంట్ అందిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. జూలై 31 నుంచి బుక్ చేసుకున్న వారికి రూ.1,19,999లకు ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ స్కూటర్ విక్రయిస్తారు. ఈ నెల 28-30 మధ్య బుక్ చేసుకున్న వారు ప్రారంభ ఆఫర్ కింద రూ.1,09,999లకే ఎస్1 ఎయిర్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ కొనుక్కోవాలని.. ఓలా ఎలక్ట్రిక్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా రూ.999 బుక్ చేసుకోవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ స్కూటర్ల బుకింగ్ విండోపై ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ శనివారం ట్వీట్ చేశారు. ‘బహుముఖ ఫీచర్లతో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఈ నెల 28న మార్కెట్లోకి వస్తుంది #ఎండ్ ఈసీఐ ఏజ్ (#EndICEage)’ అని పేర్కొన్నారు.
ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air) స్కూటర్ మూడు కిలోవాట్ల బ్యాటరీతో 125 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌తో వస్తున్నది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. హబ్ మోటార్ (ఓలా హైపర్ డ్రైవ్ మోటార్)తో ఎస్1 ఎయిర్ వస్తున్నది. ఈ మోటార్ గరిష్టంగా 11.3 హెచ్‌పీ విద్యుత్, 58 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఇంకా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, 7.0-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, ఓటీఏ అప్ డేట్స్, రిమోట్ బూట్ లాక్ లేదా అన్ లాక్, మ్యూజిక్ ప్లే వంటి ఫీచర్లు కూడా జత చేశారు.
ఎకో, నార్మల్, స్మార్ట్ మోడ్స్‌లో ఓలా ఎస్1 ఎయిర్ వస్తున్నది. మోనోషాక్ బదులు ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ @ రేర్ ఫీచర్లు ఉన్నాయి. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ మూవ్ఓఎస్-3 (Move OS-3) ఫీచర్ తో వస్తున్నది. ఈ స్కూటర్ ఒకసారి చార్జింగ్‌తో 100 కి.మీ. దూరం ప్రయాణం చేయొచ్చు. నాలుగున్నర గంటల్లో బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది. పాసిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్, మిడ్ నైట్ బ్లూ, కోరల్ గ్లామ్ కలర్స్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

