Ola S1 Air | ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్స్‌లో రికార్డు.. అదేమిటంటే..?
Ola S1 Air | ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ స్కూటర్ పర్చేజింగ్ విండో ప్రారంభించిన గంటలోపే వెయ్యి యూనిట్లు బుక్ అయ్యాయని సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు.
Ola S1 Air | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మార్కెట్లోకి ఎస్1 ఎయిర్ (S1 Air) తీసుకొచ్చింది. న్యూ నియాన్ కలర్ ఆప్షన్లో ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) వేరియంట్ ప్రవేశపెట్టినట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ (Bhavish Agarwal) వెల్లడించారు.
ఓలా ఎస్1 ఎయిర్ కోసం నిర్వహిస్తున్న పర్చేజింగ్ విండోలో శుక్రవారం తొలి గంట సేపట్లోనే వెయ్యి యూనిట్స్ ప్రీ బుకింగ్స్ అయ్యాయని భవిష్ అగర్వాల్ తెలిపారు. మూడు గంటల్లోపు మూడు వేల యూనిట్లు బుక్ చేసుకున్నారని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఓలా ఎలక్ట్రిక్.. తన ఎస్1 ఎయిర్ స్కూటర్ కోసం పర్చేజింగ్ విండో ప్రారంభించింది. ఈ మూడు రోజుల్లో కొనుగోలు చేసే వారికి ఎస్1 ఎయిర్ స్కూటర్ రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్) లకు, జూలై 31 నుంచి కొనుగోలు చేసే వారికి రూ.1,19,999 (ఎక్స్ షోరూమ్) లకు విక్రయిస్తుంది. ఈ నెల 22న ఓలా ఎస్1 ఎయిర్ కోసం ప్రీ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అత్యాధునిక మూవ్ ఓఎస్3 టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆరు రంగుల్లో లభిస్తాయి. స్టె్ల్లార్ బ్లూ, పోర్స్ లయాన్ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్, మిడ్ నైట్ బ్లూతోపాటు నియాన్ రంగులోనూ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

