Ola electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్లు ఇవే
Ola scooter bookings : బజాజ్, ఏథర్ వంటి కంపెనీలకు పోటీగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా కూడా ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో దిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ బైక్ మోడల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

Ola Electric scooter bookings : ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో జనాలు ఈవీ వెహికిల్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు టాప్ బ్రాండ్లు అన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు బజాజ్, ఏథర్ వంటి కంపెనీలకు పోటీగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా కూడా ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో దిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ బైక్ మోడల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ బైక్‌లో ఏ ఫీచర్స్ ఉంటాయి? దీనిపై ఎంత స్పీడ్‌తో వెళ్లొచ్చు? వంటి రకరకాల సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూటర్ బుకింగ్స్‌ను ప్రారంభించిన ఓలా తమ బైక్ ఫీచర్స్‌ను తాజాగా ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వేరియంట్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. మొదటిది బేసిక్ వేరియంట్. ఇందులో 2 కిలోవాట్ల మోటార్ ఉంటుంది. దీనిపై గంటకు 45 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో వెళ్లవచ్చు. రెండోది మీడియం వేరియంట్. ఇందులో 4 కిలోవాట్ల మోటర్ ఉంటుంది. దీనిపై గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇక మూడోది టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో 7 కిలోవాట్ల మోటర్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు.

రేంజ్
బ్యాటరీ ఒకసారి చార్జి చేస్తే 240 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఓలా కంపెనీ చెబుతోంది. కానీ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాకపోతే మనం సాధారణంగా వెళ్లే స్పీడ్‌తో 130 నుంచి 150 కిలోమీటర్ల వరకు అయితే వెళ్లగలం.

చార్జింగ్ టైం
ఓలా స్కూటర్‌ను చార్జింగ్ స్టేషన్ల వద్ద చార్జింగ్ పెడితే రెండున్నర గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. అదే హైపర్ చార్జింగ్ స్టేషన్ వద్ద అయితే కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ నిండుతుంది. ఒకవేల మన ఇంట్లో చార్జింగ్ పెట్టుకోవాలంటే మాత్రం బ్యాటరీ ఫుల్ అవ్వడానికి ఐదున్నర గంటల మయం పడుతుంది. ఒకసారి బ్యాటరీ ఫుల్ అవ్వగానే స్కూటర్ ఓనర్ మొబైల్‌కు ఒక నోటిఫికేషన్ వస్తుంది.

ఇతర ఫీచర్లు
ఈ ఓలా స్కూటర్లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇందులో స్కూటర్ వివరాలతో పాటు జీపీఎస్ నావిగేషన్‌ను చూసుకోవచ్చు. 4 జీ కనెక్టివిటీతో ఈ స్కూటర్ వస్తుంది. దీంతో యూట్యూబ్ చూడటం, కాల్స్ మాట్లాడుకోవడం కూడా చేయొచ్చు. స్కూటర్ స్థితిగతులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఓనర్‌కు రిపోర్టు కూడా పంపిస్తుంది. అంతేకాదు ఈ ఓలా స్కూటర్ కీలెస్ ఇగ్నేషన్తో పాటు ఫైండ్ మై స్కూటర్ ఫీచర్‌తో వస్తుంది.

ధర
ఈ ఓలా బైక్ ధర లక్ష రూపాయల నుంచి రూ. 1.2లక్షల వరకు ఉండవచ్చు. వివిధ రాష్ట్రాల్లోని ఈవీ పాలసీలు, ఫేమ్2 పాలసీలను ఉపయోగించుకుని రూ.35వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓలా కంపెనీ బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది. కేవలం రూ.499తో ఓలా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Top Electric Scooters : బజాజ్, ఏథర్‌కు పోటీగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇంతకీ ఈ-బైక్స్‌లో ఏది బెస్ట్ ?
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
జెఫ్ బెజోస్ భూరీ విరాళం.. ఎవరికో తెలుసా!
BitCoinపై బ్యాన్ విధిస్తారా..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

