Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటించింది. తన ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్ స్కూటర్లపై భారీ రాయితీ ప్రకటించింది. ఈ నెల 15-17 మధ్య కొనుగోలు చేసిన వారికి ‘హైపర్ వీకెండ్’ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ప్రోతోపాటు ఓలా ఎస్1ఎక్స్ + మోడల్ ఈవీ స్కూటర్లపై గరిష్టంగా రూ.20 వేల వరకు రాయితీ అందుబాటులో ఉంటుంది.
ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ఎయిర్ ప్రో మోడల్ స్కూటర్లపై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది ఓలా ఎలక్ట్రిక్. వీటితోపాటు ఓలా ఎస్1 ఎక్స్+ స్కూటర్ మీద రూ.20 వేల వరకూ రాయితీ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఈ నెల 17 వరకు మాత్రమే లభిస్తాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ప్రో స్కూటర్లపై రూ.5,000 డిస్కౌంట్తోపాటు ఓలా ఎస్1 ప్రో స్కూటర్ పై అదనంగా ఐదేండ్ల బ్యాటరీ వారంటీ ఇస్తామని పేర్కొన్నది. ఇక క్రెడిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.5000 రాయితీ కూడా ఇస్తుంది. ఈ ఈవీ స్కూటర్ల కొనుగోలుపై జీరో డౌన్ పేమెంట్ చార్జీ, జీరో ప్రాసెసింగ్ ఫీజు వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.