ముంబై, జూలై 29: ద్విచక్ర వాహన తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ.. ఈవారంలోనే ఐపీవోకి రాబోతున్నది. షేర్ల ధరల శ్రేణి రూ.72-76 స్థాయిలో ఉంటుందని ప్రకటించింది. రూ.6,100 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి ఆగస్టు 2 నుంచి 6 వరకు షేర్లను విక్రయించనున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ..
ఆఫర్ ఫర్ సేల్ రూట్ 8.49 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుండటంతో రూ.6 వేల కోట్లకు పైగా నిధులు సమకూరవచ్చునని, ఇలా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్లు ప్రకటించారు. వీటిలో సెల్ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ. 1,227 కోట్లు, రీసర్చ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం రూ.1,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అలాగే రూ.800 కోట్ల బకాయిలను చెల్లించనున్నారు.