Ola Electric | ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ `ఓలా ఎలక్ట్రిక్` కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. `బాస్ – బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ (BOSS – Biggest Ola Season Sale)`లో ఆఫర్లు అందిస్తున్నది. ఓలా ఎస్ 1 ఈవీ స్కూటర్‌ను రూ.49,999లకే విక్రయిస్తుంది. దీని ధరపై రూ.40 వేల వరకూ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. అందులో రూ.25 వేల వరకూ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. డిస్కౌంట్లతోపాటు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్, హైపర్ చార్జింగ్ క్రెడిట్స్, మూవ్ ఓఎస్+ అప్‌గ్రేడ్ తదితర మార్గాల్లో రూ.40 వేల వరకూ రాయితీ అందిస్తోంది.
`బాస్ – బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ (BOSS – Biggest Ola Season Sale)` సేల్‌లో భాగంగా రెండు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ గల ఓలా ఎస్ 1 ఎక్స్ స్కూటర్ కేవలం రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఎస్1 స్కూటర్‌పై రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేలు ఇతర డిస్కౌంట్లు లభిస్తాయి. 8 ఏండ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకూ రూ.7000 విలువైన బ్యాటరీ వారంటీ ఫ్రీగా ఇస్తోంది ఓలా ఎలక్ట్రిక్. మూవ్ ఓఎస్ + అప్‌గ్రేడ్ కింద రూ.6000, హైపర్ చార్జింగ్ క్రెడిట్స్ రూపంలో రూ.6000తోపాటు సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.5000 వరకూ ఫైనాన్స్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.
ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ ఈ సందర్భంగా స్పందిస్తూ.. `పండుగల సీజన్ సందర్భంగా మా కస్టమర్లకు ఆఫర్లు అందించేందుకు బాస్ తెచ్చినందుకు ఆనందంగా ఉన్నాం. ఐసీఈ ఏజ్ వెహికల్స్‌కు స్వస్తి పలికి ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడమే మా మిషన్. అందుకోసం అతిపెద్ద డిస్కౌంట్లు, బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ ఆఫర్లతో ఈవీ స్కూటర్లు కొనుగోలు చేసేందుకు కస్టమర్లకు వెసులుబాటు కల్పిస్తున్నాం` అని చెప్పారు.
ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 పోర్ట్‌ఫోలియో స్కూటర్లపై ఆరు ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది. ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ స్కూటర్ల ధరలు రూ.1,34,999, రూ.1,07,499. కాగా, ఎస్1ఎక్స్ రెండో కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ రూ.74,999, మూడు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ రూ.87,999, 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ రూ.1,01,999 లభిస్తాయి.