Ola Electric | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..తాజాగా ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌లో భాగంగా ఒకేసారి నాలుగు మాడళ్లను పరిచయం చేసింది. వీటిలో రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్ బైకులు 2.5 కిలోవాట్లు, 3.5 కిలోవాట్లు, 4.5 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన బైకులు రూ.74,999, రూ.84,999, రూ.94,999 ధరతో లభించనున్నాయి. అలాగే రోడ్‌స్టర్ ఎక్స్+ మాడల్ 4.5 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ రూ.1,04,999, రోడ్‌స్టర్ ఎక్స్+ 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ రూ.1,54,999గా నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ..దేశీయ ఈవీ విభాగంలో చరిత్ర సృష్టించిన సంస్థ..ఈసారి బైకుల సెగ్మెంట్లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.
రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్ బైకు ప్రత్యేకతలు..