Ola EV Car | మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి
Ola EV Car | ఓలా ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లోకి రానున్నది. ఈవీ కార్లు, స్కూటర్లలో సేఫ్టీ, సాఫ్ట్వేర్, సెల్స్ కామన్ అని సంస్థ సీఎఫ్‌వో అరుణ్‌కుమార్ తెలిపారు.
Ola EV Car | ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసి ఇప్పటికే సూపర్ సక్సెస్ అయిన సంస్థ ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దేశీయ రోడ్లపైకి ఓలా ఎలక్ట్రిక్ కారు రానున్నదని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జీఆర్ అరుణ్ కుమార్ చెప్పారు. టూ వీలర్స్.. స్కూటర్ల తయారీకి ఉపయోగించిన టెక్నాలజీ షేరింగ్‌తో కార్ల తయారీపై ఫోకస్ చేసింది. టూ వీలర్స్ టెక్నాలజీలో కొంత భాగం షేరింగ్‌లో లబ్ధి పొందాలని యోచిస్తున్నది. ఇలా రూపుదిద్దుకుంటున్న కారు డిజైన్ అడ్వాన్స్ దశలో ఉన్నదని అరుణ్ కుమార్ తెలిపారు.
`సాఫ్ట్వేర్, సేఫ్టీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, సెల్స్, డ్రైవ్ ట్రైన్ తదితర అంశాలన్నీ టూ వీలర్స్‌లోనూ, కార్లలోనూ కామన్` అని ఇండియా ఎనర్జీ వీక్ ఫోరం సదస్సు వద్ద అరుణ్ కుమార్ వెల్లడించారు. టూ వీలర్స్‌లో వాడే టెక్నాలజీలో 30-40 శాతం కార్లలోనూ ఉపయోగించొచ్చునన్నారు.
లిథియం అయాన్ సెల్స్, ఇన్‌హౌస్ బ్యాటరీస్ తక్కువ ఖర్చుతో తయారు చేస్తే తాము 50 వేల డాలర్ల లోపు ధరకే తొలి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతేడాది ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ చెప్పారు. ఎలన్‌మస్క్ సారధ్యంలోని టెస్లా ఇంక్, దక్షిణ కొరియా హ్యుండాయ్ మోటార్స్‌తోపాటు దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌తోనూ పోటీ పడాలని ఓలా ఎలక్ట్రిక్ తలపోస్తున్నది.
అఈ కారు రేంజ్ పరంగా చూస్తే 4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఇది టెస్లా కారుతో పోటీ పడగలదని ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. ఓలా కారు చూడగానే ఆకట్టుకుంటున్నది. పైకప్పు పూర్తిగా గ్లాస్‌తో ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కి.మీల దూరం ప్రయాణించొచ్చు. ఇది హ్యాండ్‌లెస్, కీలెస్ ఎంట్రీ కారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

